Revanth Reddy Police Case : ఖాకీలపై కామెంట్స్ రేవంత్ పై కేసు
బట్టలు ఊడదీసి కొడతానన్న టీపీసీసీ చీఫ్
Revanth Reddy Police Case : టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఈ మధ్యన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తూ మరింత హీటెక్కిస్తున్నారు. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తమ కార్యకర్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒత్తిళ్ల మేరకు దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆపై గౌడ్ అంతు చూస్తానని హెచ్చరించారు.
Revanth Reddy Police Case Viral
తమ వారిపై దాడులకు పాల్పడిన పోలీసులు ఎవరో వారి పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటున్నానని అన్నారు. వారందరినీ టార్గెట్ చేస్తానని హెచ్చరించారు. పోలీసుల గుడ్డలు ఊడ తీసి కొడతా అని నోరు జారారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy Police Case) చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఖాకీలు కన్నెర్ర చేశారు. టీపీసీసీ చీఫ్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసు సంఘం నేతలు హెచ్చరించారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా బట్టలు విప్పదీసి కొడతానన్న రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పోలీసుల సంఘం నేత గుణవర్దన్ . ఈ మేరకు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి రెచ్చి పోయి మాట్లాడడం మంచి పద్దతి కాదన్నారు. తనకు కూడా సెక్యూరిటీ కల్పిస్తున్నది పోలీసులేనన్న సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Tirumala Devotees : శ్రీవారి ఆదాయం రూ. 3.94 కోట్లు