Revanth Reddy : సాగు నీటి రంగం లెక్కలు తేల్చండి
ఆదేశించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం తన నివాసంలో వ్యవసాయ, నీటి పారుదల రంగాలపై మంత్రులతో కలిసి సమీక్షించారు.
Revanth Reddy Comment
1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ ఖర్చులు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాల గురించి అధికారులు సీఎంకు వెల్లడించారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు పూర్తిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ప్రజలకు తెలియకుండా దాచి పెట్టే ప్రయత్నం చేయొద్దని అన్నారు. ఒక వేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నామన్నారు.
ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు.
Also Read : Gidugu Rudraraju : బాబు..పవన్..జగన్ ఒక్కటే