Revanth Reddy : వేటు వేసేందుకు రంగం సిద్దం
రాజగోపాల్ రెడ్డి మార్పు ఖాయం
Revanth Reddy : గత కొంత కాలం నుంచీ పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా జరిగింది కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో.
టీపీసీసీ చీఫ్ గా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి ముందు నుంచీ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఆయన నోరు జారడం లేదు. ఇప్పటికే పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కేవలం హైకమాండ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక పార్టీలో ఉంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జపం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది.
ఓ వైపు సోనియా గాంధీని పొగుడుతూనే జైలుకు పోయి వచ్చిన వాళ్లతో తాను నీతులు చెప్పించు కోవాల్సిన పని లేదంటూ సంచలన కామెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి.
ఆ మాటలు బయటకు రేవంత్ రెడ్డి అని చెప్పక పోయినా దానర్థం ఆయనేనని పేర్కొంటున్నారు కొందరు పార్టీ నాయకులు.
ఇదిలా ఉండగా తాడో పేడో తేల్చాల్సిన సమయం రానే వచ్చింది. రాజగోపాల్ రెడ్డి రెండు నాల్కల ధోరణి పై అంతర్గతంగా చర్చిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).
పార్టీ హై కమాండ్ తప్పక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇందుకు సంబంధించి షోకాజ్ నోటీసు ఇవ్వాలా లేక వేటు వేయాలా అన్న దానిపై పునరాలోచనలో పడింది.
మొత్తంగా కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సంగతి పార్టీలో హాట్ టాపిక్ గా మార్చేలా చేసింది.
Also Read : ఇంటిని మినీ బ్యాంక్ గా వాడుకున్నారు