Revanth Reddy : ఒకేసారి 119 స్థానాలకు అభ్యర్థుల వెల్లడి
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బాస్, సీఎం కేసీఆర్ 119 స్థానాలకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలపై ఒత్తిడి పెరిగింది. ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఫుల్ జోష్ లో ఉంది.
Revanth Reddy Said Updates for Assembly Seats
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) కసరత్తు చేస్తోంది. సోమవారం జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ముందస్తు వ్యూహంలో భాగంగా అభ్యర్థులను ప్రకటించ లేదని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 70 స్థానాలకు పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ పరిశీలకుడు మురళీధరన్ తెలిపారు. మొత్తం ఒకేసారి 119 సీట్లకు క్యాండిడేట్స్ ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మంచి ముహూర్తంలో లిస్ట్ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని ఈ సందర్బంగా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. వామపక్షాలతో కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
Also Read : TTD EO : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు