Revanth Reddy : త్వరలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడి
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరనేది ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే మూడు విడతలుగా జల్లెడ పట్టామన్నారు. ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.
Revanth Reddy Said about Assembly Seats Announcement will be soon
హైకమాండ్ నిర్ణయం మేరకు టికెట్ ల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ 119 స్థానాలకు గాను 115 సీట్లకు అభ్యర్తులను ఖరారు చేశారు. దీంతో ఇతర పార్టీల చీఫ్ లపై ఒత్తిడి పెరిగింది.
ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే దరఖాస్తులను స్వీకరించింది. డెడ్ లైన్ కూడా పూర్తయింది. ఓసీ అభ్యర్థులు రూ. 50,000 వేలు, బీసీ అభ్యర్థులు ఒక్కరొక్కరు అభ్యర్థిత్వం కోసం రూ. 25,000 ఫీజుగా నిర్ణయించింది పార్టీ.
దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. ఇంకా పవర్ లోకి రాకుండానే వసూళ్ల దందా మొదలు పెట్టిందంటూ ఆరోపించారు కొందరు అభ్యర్థులు. మరికొందరు పార్టీ కోసం వసూలు చేయడంలో తప్పు లేదంటూ పేర్కొన్నారు. మొత్తంగా టికెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్య కూడా దరఖాస్తు చేయడం పార్టీకి విరుద్దమంటూ విమర్శలు వచ్చాయి. ఒకరికి ఒకే సీటు అన్నది పార్టీ సిద్దాంతం.
Also Read : Yennam Srinivas Reddy : యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై వేటు