Revanth Reddy : దుబ్బాక – తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). కేసీఆర్ ఎన్ని నక్క జిత్తులు వేసినా వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దుబ్బాక లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Comment
119 నియోజకవర్గాలలో కనీసం 80 సీట్లు గెలవడం పక్కా అని మరోసారి ప్రకటించారు. ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులను కేసీఆర్ ఇవ్వలేదన్నారు. అయినా చెరుకు ముత్యం రెడ్డి కేసీఆర్ ను అడ్డుకున్నాడని స్పష్టం చేశారు. దుబ్బాకకు నిధులు రాకుండా చేయడంలో, సిద్దిపేటకు తరలించుకు పోవడంలో మామా అల్లుళ్లకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.
నీతికి, నిజాయితీకి మారు పేరు ముత్యం రెడ్డి అన్నారు. ఆయన తనయుడు ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని , బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వక తప్పదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : Akunuri Murali : సీఎం తెలంగాణకు శాపం