Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ప్రాంతాన్ని నిట్ట నిలువునా మోసం చేసి, ఎన్ కౌంటర్లకు తెర తీసి, అక్రమార్కులకు అడ్డాగా మార్చేసి, వ్యాపారస్తులు, కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలికిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఆయన తొలుత టీఆర్ఎస్ లో ఉన్నారు.
Revanth Reddy Comment about Chandrababu
ఆ తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. కోడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్నాడు. జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చాడు. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యాడు.
పార్టీ అనూహ్యంగా మల్కాజ్ గిరి ఎంపీ సీటు కేటాయించింది. దీంతో ఎంపీగా గెలుపొందాడు. లక్ కలిసొచ్చింది. టీపీసీసీ చీఫ్ గా నియమితులయ్యాడు. ఆ తర్వాత ప్రచారాన్ని చేపట్టారు. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతం సీఎం రేసులో నిలిచాడు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీ కూతురినని, కాంగ్రెస్ పార్టీకి కోడలినని అన్నారు. తాను చంద్రబాబు నాయుడి మనిషినని నిస్సిగ్గుగా బయటకు చెప్పారు. తెలంగాణను సర్వ నాశనం చేసిన వారిలో బాబు ఒకడు.
Also Read : Minister KTR : కాంగ్రెసోళ్లు చిల్లరగాళ్లు – కేటీఆర్