Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇక తానే సీఎం అవుతానని, సంతకం చేసేది పక్కా అని స్పష్టం చేశారు. తనకు పూర్తి స్వేచ్చ ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఒక గొప్ప విజన్ కలిగిన నేత చంద్రబాబు నాయుడు అంటూ మరోసారి ప్రశంసలు కురిపించారు.
Revanth Reddy Challenge
ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను సర్వ నాశనం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవన్నారు.
ఇవాళ ధరణి పేరుతో వేల కోట్లను దోచుకున్న గజ దొంగలు వీళ్లంటూ మండిపడ్డారు. ప్రజలు బొంద పెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఆయన ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి.
దేశంలో కరెంట్ ను తీసుకు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్న సోయి కూడా లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. మొత్తం 119 నియోజకవర్గాలలో కనీసం 75 నుంచి 80 సీట్లు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ . ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమానం ప్రభుత్వంలో రానుందన్నారు.
Also Read : MLC Kavitha : గులాబీ జెండా గెలుపు పక్కా