Revanth Reddy Seethakka : కాంగ్రెస్ వ‌స్తే సీత‌క్క సీఎం – రేవంత్

తానా స‌భ‌లో టీపీసీసీ చీఫ్ కామెంట్స్

Revanth Reddy Seethakka : టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని, బీఆర్ఎస్ కు ఇక పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. అమెరికాలో జ‌రిగిన ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం (తానా) స‌మావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక‌వేళ పార్టీ గ‌నుక ప‌వ‌ర్ లోకి వ‌స్తే త‌మ పార్టీ త‌ర‌పున సీత‌క్క సీఎం అవుతుంద‌ని జోష్యం చెప్పారు రేవంత్ రెడ్డి. దీంతో ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి పార్టీలో.

ఇప్ప‌టికే వ‌ర్గాలుగా విడి పోయారు టీపీసీసీలో. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇలా సీత‌క్క గురించి మాట్లాడ‌టాన్ని పార్టీ సీనియ‌ర్లు జీర్ణించు కోలేక పోతున్నారు. ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్ట‌డం త‌మ పార్టీ ముందున్న ల‌క్ష్యాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డిని ఎన్నారైలు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు సంధించారు. ద‌ళితులు, గిరిజ‌నులు సీఎం కాగ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే క‌నీసం డిప్యూటీ సీఎం ప‌ద‌వినైనా ఇస్తారా అంటూ నిల‌దీశారు . దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి అవ‌స‌ర‌మైతే తాను సీత‌క్క‌ను సీఎం చేయాల‌ని పార్టీ హై క‌మాండ్ కు ప్ర‌తిపాదిస్తాన‌ని చెప్పారు.

Also Read : DK Shiva Kumar : 12న క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ నిర‌స‌న

 

Leave A Reply

Your Email Id will not be published!