Revanth Reddy : పొద్దున తిట్టుకుంటం సాయంత్రం కలిసిపోతం
జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పలుమార్లు ఆరోపణలు చేసిన జగ్గారెడ్డి గురించి తామిద్దరం కలిసే ఉన్నామని పేర్కొన్నారు. అంతే కాదు క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు టీపీసీసీ చీఫ్. ఏ పార్టీలో లేనంతటి స్వేచ్ఛ ఒక్క తమ పార్టీలోనే ఉంటుందన్నారు.
అందరి అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఇది వేదికగా ఉపయోగ పడుతుందన్నారు. ఇదే సమయంలో జగ్గన్న నేను పొద్దున తిట్టుకుంటం సాయంత్రం అయితే చాలు అన్నీ మరిచి పోయి కలిసి పోతమని అన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy) . ఈ ఇద్దరు నాయకులు తెలంగాణ రాజకీయాలలో కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు.
జగ్గారెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటంలో దిట్ట. ఇక రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో డైనమిక్ లీడర్ గా ఉన్నారు. ఈ ఇద్దరూ అసెంబ్లీ ఆవరణలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పరస్పరం కలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అన్నా నేను ఇద్దరం ఒక్కటే మీరు అనుకుంటున్నట్లు ఏం లేదన్నారు.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత జగ్గారెడ్డి కూడా జోకులు పేల్చారు. నాకు రేవంత్ రెడ్డి మధ్య ఎలాంటి పంచాయితీ లేదన్నారు. రేవంత్ రెడ్డి చేసే పాదయాత్రకు త్వరలోనే ప్రకటన చేస్తానని చెప్పారు.
కాగా రేవంత్ రెడ్డి దిగి పోయిన తర్వాతే తాను పీసీసీ చీఫ్ అవుతానని అంత వరకు వెయిట్ చేస్తానంటూ స్పష్టం చేశారు జగ్గారెడ్డి(Revanth Reddy) . మొత్తంగా ఇద్దరు డైనమిక్ లీడర్లు కలిసి నవ్వుకోవడం పార్టీ వర్గాలలో జోష్ నింపేలా చేసింది.
Also Read : కవిత..బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలి