Revanth Reddy : టీఎస్పీఎస్సీ బోర్డును ర‌ద్దు చేస్తాం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy : కామారెడ్డి – అక్ర‌మాల‌కు , అవినీతికి అడ్డాగా మారి ల‌క్ష‌లాది మంది నిరుద్యోగ జీవితాల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ (టీఎస్పీఎస్సీ)పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న సంచ‌ల‌న కామెంట్ చేశారు. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ర‌ద్దు చేస్తామ‌న్నారు. దాని స్థానంలో యూపీఎస్సీ త‌ర‌హాలో ఏర్పాటు చేస్తామ‌న్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy Promiss

టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తిగా ర‌ద్దు చేస్తామ‌ని దాని స్థానంలో అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తుల‌తో కొత్త‌గా బోర్డును ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో వ‌చ్చిన బీఆర్ఎస్ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు భ‌ర్తీ చేయ‌లేద‌ని మండిప‌డ్డారు.

బిక్నూర్ కు చెందిన రైతు చ‌ని పోతే కేసీఆర్ ఇక్క‌డికి వ‌చ్చాడా అని ప్ర‌శ్నించారు. ఏం మొఖం పెట్టుకుని కామారెడ్డిలో సీఎం పోటీ చేస్తున్నాడంటూ నిల‌దీవారు. కానీ త‌మ పార్టీ లింబ‌య్య కుటుంబాన్ని ఆదుకుంద‌న్నారు. ల‌క్ష రూపాయ‌లు ఇచ్చి ఆర్థిక సాయం చేశామ‌ని తెలిపారు.

40 ఏళ్లుగా వివిధ ప‌ద‌వులను అనుభ‌వించిన కేసీఆర్ కు కోనాపూర్ గుర్తు రాలేద‌న్నాడు. కానీ కేవ‌లం ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని ఇక్క‌డికి వ‌చ్చాడ‌ని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ముదిరాజ్ ల‌కు సీట్లు ఇవ్వ‌కుండా మోసం చేశాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : Nagarjuna Networth : నాగార్జున నిక‌ర ఆస్తులు రూ. 3,010 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!