Revanth Reddy Slams : ప్రభుత్వ నిధులు మళ్లించే ఛాన్స్
కేసీఆర్ పై సిఇవోకు రేవంత్ ఫిర్యాదు
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎలాగూ ఓడి పోతున్నామన్న భయంతో ముందస్తుగానే దుకాణం సర్దుకుంటున్నాడని ఆరోపించారు. అయితే పోతూ పోతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధులను దారి మళ్లించేందుకు ప్రయత్నం చేసే అవకాశం లేక పోలేదని మండిపడ్డారు.
Revanth Reddy Serious Comments
ఇందుకు సంబంధించి పూర్తిగా ఆయనకు, ఆపద్దరమ్మ సర్కార్ కు ఎలాంటి పవర్స్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని సిఇఓకు విన్నవించారు. ఇందుకు సంబంధించి తాను స్వయంగా శనివారం వికాస్ రాజ్ ను కలుస్తానని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఇలాంటి చిల్లర రాజకీయాలు, వేషాలు ఇక ఎంత మాత్రం తెలంగాణ సమాజం సహించ బోదని హెచ్చరించారు. ఓటమి భయంతో కేసీఆర్ రైతు బంధు నిధులను దారి మళ్లిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్.
ప్రస్తుత ప్రభుత్వం జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి నిఘా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తాను సూసైడ్ చేసుకుంటానని అన్న బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలని సిఇఓ ఆదేశించారు.
Also Read : Akunuri Murali : ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే తన్నండి