Revanth Reddy : కేసీఆర్ కు కాలం చెల్లింది – రేవంత్

బీజేపీ..ఎంఐఎం..బీఆర్ఎస్ ఒక్క‌టే

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి ప్ర‌జ‌లు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

Revanth Reddy Slams KCR

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల‌న్నీ ఒక్క‌టేన‌ని మండిప‌డ్డారు. వాళ్ల ఎజెండా ఒక్క‌టే కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ప్ర‌జ‌లు వీళ్ల ఆడుతున్న నాట‌కాల‌ను గ‌మ‌నించార‌ని హెచ్చ‌రించారు.

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు, అధికార మ‌దంతో విర్ర వీగుతున్న సీఎం కేసీఆర్ కు షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). కేసీఆర్ కు కొమ్ము కాస్తున్న బీజేపీ, ఎంఐఎంల‌ను తెలంగాణ నుండి త‌రిమి కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏం ప్ర‌త్యేకత ఉంద‌ని ప్ర‌శ్నించారు. సంపులో మోటార్ ఆన్ చేసుకుని బిందెలో నీళ్లు ప‌ట్టుకున్న‌ట్టే ఉందంటూ ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్. నీల్లు, నిధులు, నియామ‌కాలు అనే దిక్కు మాలిన స్లోగ‌న్ తో తెలంగాణ ఏర్ప‌డ లేద‌న్నారు రేవంత్ రెడ్డి. క‌ర్ణాట‌క కంటే తెలంగాణ అత్య‌ధిక ఆదాయం క‌లిగి ఉంద‌న్నారు.

Also Read : Another Leo Pard : తిరుమ‌ల‌లో చిక్కిన మ‌రో చిరుత

Leave A Reply

Your Email Id will not be published!