Revanth Reddy : పిండ ప్రదానం చేస్తేనే శాంతి – రేవంత్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై కామెంట్స్
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. వరదల్లో ఓ వైపు జనం కొట్టుకు పోతుంటే తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ నిద్ర పోతున్నారంటూ ఆరోపించారు.
Revanth Reddy Comments
అత్యంత బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు, ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ కు పిండ ప్రదానం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడైతే కానీ తెలంగాణ రాష్ట్రానికి శాంతి కలుగుతుందన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఇప్పటి వరకు పలువురు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గల్లంతు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు జిల్లాలు వర్షాల దెబ్బకు అల్లాడుతుంటే మరో వైపు రాష్ట్ర రాజధానిని డల్లాస్ చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఏడున్నాడంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి.
రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న చెరువులను, కుంటలను కబ్జా చేశారని , ఎక్కడ చూసినా అపార్ట్ మెంట్లు కట్టారని , ఇవాళ కాస్తంత వర్షాలకే నీళ్లు చేరుతున్నాయని దీనికి ట్విట్టర్ టిల్లు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
Also Read : Daggubati Purandeswari : జగన్ సర్కార్ పై పురందేశ్వరి ఫైర్