Prabhakar Rao : హైదరాబాద్ – విద్యుత్ రంగంలో ఏం జరుగుతుందో సరైన వివరాలు ఎందుకు తెలియ చేయలేదంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన వెంటనే విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఇవాళ ఉన్నతాధికారులు పూర్తి వివరాలతో తన ముందుకు రావాలని ఆదేశించారు.
Prabhakar Rao Viral
ఈ మేరకు విద్యుత్ శాఖలో కీలకమైన సంస్థలుగా ఉన్న ట్రాన్స్ కో, జెన్ కో సంస్థలకు ఇప్పటి వరకు సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు ఉన్నట్టుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని సీఎస్ శాంతి కుమారికి సమర్పించారు.
విచిత్రం ఏమిటంటే ఇప్పటి దాకా రూ. 85,000 కోట్లు ఎలా చేరుకున్నాయంటూ ప్రశ్నించారు. ఇంత కాలం ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఎందుకు సీఎండీ రాలేదని పేర్కొన్నారు. సీఎండీ ప్రభాకర్ రావు దీనికి పూర్తి బాధ్యత వహించాలని, ఆయన రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించ వద్దంటూ ఆదేశించారు సీఎస్ ను రేవంత్ రెడ్డి.
విద్యుత్ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా ఎందుకు దాచి ఉంచారని నిలదీశారు. ఇదిలా ఉండగా తన సమీక్షకు రాకుండా డుమ్మా కొట్టిన ప్రభాకర్ రావు ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లినట్లు సమాచారం.
Also Read : MLA Raja Singh : అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకరైతే నేను రాను