Revanth Reddy : పొన్నాలకు అసలు సిగ్గుందా – రేవంత్
సచ్చే ముందు పార్టీ మారితే ఎలా
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ మాజీ చీఫ్ ,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆ పార్టీ ప్రస్తుత చీఫ్ , ఎంపీ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఎవరన్నా సచ్చే ముందు పార్టీ మారతారా అని ప్రశ్నించారు. ఏం రోగం వచ్చిందని ఇవాళ పార్టీ పదవికి రాజీనామా చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు.
Revanth Reddy Comments Viral
పొన్నాల లక్ష్మయ్యకు అసలు సిగ్గు అనేది ఉందా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). పార్టీ ఆయనకు ఏం తక్కువ చేసిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆపై మంత్రిని చేసింది. టీపీసీసీ పదవి ఇచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలని నిలదీశారు టీపీసీసీ చీఫ్.
అసలైన సమయంలో పార్టీని వీడడం మంచి పద్దతి కాదన్నారు. ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకరు లేదా ఇద్దరు పార్టీని వీడినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.
పొన్నాల లక్ష్మయ్య పోవడం వల్ల ఏం ఫరఖ్ పడదన్నారు రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే సచ్చే ముందు పార్టీ మారడమే విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు.
Also Read : Ashok Gajapathi Raju : త్వరలోనే బాబు బయటకు వస్తారు