Revanth Reddy : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
కేసీఆర్, కేటీఆర్ చచ్చి పోయారు
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓ వైపు భారీ వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే ఒకరు ఫామ్ హౌస్ లో , మరొకరు విందులు వినోదాలలో మునిగి తేలుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
Revanth Reddy Comments
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ భూమి మీద ఉన్నా లేనట్టేనని ఎద్దేవా చేశారు. అందుకే వారు లేరని ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయ్యారని సోమవారం ఆ ఇద్దరు తండ్రీ కొడుకులకు తద్దినం పెట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు పిలుపునిస్తున్నానని చెప్పారు టీపీసీసీ చీఫ్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ , బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీ రేవంత్ రెడ్డి((Revanth Reddy) కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ మరో వైపు హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : MP Sanjay Singh : రాందాస్ కామెంట్స్ సంజయ్ సీరియస్