Revanth Reddy : హైదరాబాద్ – పదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ ఈసారి ఎన్నికల్లో పతనం కావడం ఖాయమని జోష్యం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 119 స్థానాలలో ఆ పార్టీకి కనీసం 30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఓపెన్ జైలుగా మారిందని ధ్వజమెత్తారు.
Revanth Reddy Serious Comments
ఎవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి లేదని ఇదేమని అడిగితే కేసులు నమోదు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇవాళ జనం డిసైడ్ అయ్యారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినోత్సవం కానుకగా తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని జోష్యం చెప్పారు. తొలి సంతకం తానే సీఎంగా చేస్తానంటూ ప్రకటించారు. ప్రజల్లో పూర్తి వ్యతిరత నెలకొందన్నారు.
ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం 80 నుంచి 85 సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరు మారుస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). దానిని అంబేద్కర్ భవన్ అని పేరు పెడతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన అవినీతి దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు.
Also Read : CEC : సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ఫోకస్