Revanth Reddy : కేసీఆర్ పాల‌న దోపిడీకి చిరునామా

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్

Revanth Reddy : కోడంగ‌ల్ – తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తెలంగాణ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేసి జైలులో వేస్తామ‌ని ప్ర‌క‌టించారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు.

Revanth Reddy Slams KCR

ఈ ప్రాంతాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని, ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అభివృద్ది చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. నారాయ‌ణ పేట – కోడంగ‌ల్ ఎత్తి పోత‌ల ప‌థ‌కాన్ని ప‌డావు పెట్టార‌ని కానీ తాను వ‌చ్చాక దానిని పున‌రుద్ద‌రించి నీళ్లు వ‌చ్చేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

త‌న‌ను క‌డుపులో పెట్టుకుని ఆశీర్వ‌దిస్తున్న కోడంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ ఇవ్వ‌లేద‌న్నారు. పేద‌ల‌కు ఇళ్లు ఇస్తాన‌ని మోసం చేశాడంటూ కేసీఆర్ పై మండిప‌డ్డారు.

పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వ‌లేదు కానీ తాను 150 గ‌దుల‌తో గ‌డీని క‌ట్టుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. పదేళ్లు కేసీఆర్ కు ఛాన్స్ ఇచ్చార‌ని ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల‌ని కోరారు.

Also Read : Mallu Bhatti Vikramarka : బీజేపీ బీఆర్ఎస్ ఒక్క‌టే

Leave A Reply

Your Email Id will not be published!