Revanth Reddy Slams : కేసీఆర్ పనై పోయింది – రేవంత్ రెడ్డి
ప్రజలు తన్ని తరిమేసే రోజు వచ్చింది
Revanth Reddy : దుబ్బాక – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ పనై పోయిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దుబ్బాకలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. దుబ్బాకకు రావాల్సిన నిధులను సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. ఈ ప్రాంతానికి పట్టిన శని సీఎం కుటుంబమని ఆరోపించారు. నమ్మి చేతికిస్తే తెలంగాణను బొందల గడ్డగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy Slams KCR
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తమకు 80 సీట్లు తప్పక వస్తాయని చెప్పారు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లకు ఎలా ఎదిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకనాడు డబ్బుల కోసం ఇబ్బందులు పడిన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ రావు, వినోద్ రావులు ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తారో రాష్ట్ర ప్రజలు తెలుసు కోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీని తన్ని తరిమేసే రోజు తప్పకుండా వస్తుందన్నారు. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : Pawan Kalyan : తెలంగాణ యువత చైతన్యానికి ప్రతీక