Revanth Reddy : మాన కొండూరు – బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దొర గడీలకు తాళం వేయక తప్పదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మానకొండూరు లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఆనాడు సోనియా గాంధీ గనుక దయ తలిచి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక పోతే ఇవాళ కేసీఆర్ సీఎం అయ్యే వాడా అని ప్రశ్నించారు.
Revanth Reddy Slams BRS Govt
కానీ ఆ కృతజ్ఞత అన్నది లేకుండా మోసానికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న కేసీఆర్ కేవలం పథకాలు, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకున్నారంటూ ధ్వజమెత్తారు. ఇక దోచుకున్న వేల కోట్ల సొమ్మును ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇప్పుడు నానా తంటాలు పడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి.
ఆరు నూరైనా సరే తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. వచ్చిన వెంటనే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని ప్రకటించారు. దోచుకున్న సొమ్మును, అక్రమంగా చేజిక్కించుకున్న భూములను ప్రజల పరం చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇప్పటికే తమ పార్టీ బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు చెప్పారు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు