Revanth Reddy : సీఎం ఫామ్ హౌస్ కు పరిమితం ఖాయం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Revanth Reddy : నారాయణపేట – కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఆగమాగం అయ్యారని , ఇక కేసీఆర్ ను సాగనంపేందుకు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేటలో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ప్రసంగించారు.
Revanth Reddy Comments on KCR
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అస్తవ్యవస్తంగా మారిందని ఆవేదన చెందారు. నారాయణపేటకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. దీనికి ప్రధాన కారకుడు సీఎం కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు.
నారాయణపేట, కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఆరు గ్యారెంటీలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చుతాయని తెలిపారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన బీఆర్ఎస్ ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రేవంత్ రెడ్డి.
వారం రోజుల్లోనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడం పక్కా అన్నారు. కేసీఆర్ ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామని, వాటిని ప్రజల పరం చేస్తామని ప్రకటించారు.
Also Read : Manda Karnel Joins : బీజేపీలో చేరిన మందకృష్ణ సోదరుడు