Revanth Reddy : పాల‌న అస్త‌వ్య‌స్తం తెలంగాణ విధ్వంసం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

Revanth Reddy : తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ పాల‌న గాడి త‌ప్పింద‌ని, దోపిడీ త‌ప్ప ఇంకేమీ లేద‌న్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అప్పులు తెచ్చిండి..త‌న‌కు కావాల్సిన వాళ్ల‌కు దోచి పెట్టిండు.

ఇంత‌కు మించి చేసింది ఏమీ లేద‌న్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో చెప్పుకునేందుకు ఏ చ‌రిత్రా లేద‌న్నారు. ఘ‌న‌మైన చ‌రిత్ర‌ను తుడిచి వేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్‌(Revanth Reddy).

బుధ‌వారం కాంగ్రెస్ పార్టీ 138వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ భ‌వ‌న్ లో పార్టీ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకే ర‌క‌మైన ఎజెండాతో ప‌ని చేస్తున్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు.

రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌తో బీజేపీలో క‌ద‌లిక మొద‌లైంద‌ని, దీంతో త‌మ పునాదులకు ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేన‌ని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెడుతున్నాయ‌ని కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

జ‌న‌వ‌రి 27 నుంచి తెలంగాణ‌లో అధికార పార్టీపై యుద్దం చేస్తున్నామ‌ని అన్నారు. తాను పాద‌యాత్ర చేప‌డ‌తాని ఇక ప్ర‌జల‌తో క‌లిసి వారి స‌మ‌స్య‌ల గురించి లేవ‌దీస్తాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

క‌ల్వకుంట్ల ఫ్యామిలీ అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని ఆరోపించారు. దానిని క‌ప్పి పుచ్చుకునేందుకే నాట‌కాలు ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ స‌ర్కార్ మ‌రోసారి ఆంగ్లేయుల విధానాల‌ను అమ‌లులోకి తీసుకు రావాల‌ని చూస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు రేవంత్ రెడ్డి.

Also Read : అరుదైన చ‌రిత్ర కాంగ్రెస్ ఘ‌న‌త‌

Leave A Reply

Your Email Id will not be published!