Revanth Reddy : డిజిటల్ సభ్యత్వాలలో దేశంలోనే తమ పార్టీ టాప్ లో ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇప్పటి దాకా 50 లక్షలు పూర్తయ్యాయి. రాబోయే ఎన్నికల్లో మరికొన్ని ఓట్లు రాబడితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో మట్లాడారు. సభ్యత్వం చేసిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. కేసీఆర్ కు పీకే ఉంటే తమకు లక్షలాది మంది బుల్లెట్ లాంటి కార్యకర్తల బలగం ఉందన్నారు.
ఎన్ని ప్లాన్లు చేసినా పీకే లాంటి వాళ్లు లక్షల మంది పీకేలు వచ్చినా కేసీఆర్ ను ఎవరూ కేసీఆర్ ను కాపాడ లేరన్నారు. ఆయన పని ఖతమైందన్నారు. ప్రజలు సీఎంను తిరస్కరించేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణలో మార్పు ఖాయమని, ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చేస్తామన్నారు. టీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలను నయా పైసాతో సహా కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. బయటకు జనాన్ని మోసం చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు తప్పక ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. పైరవీలకు తావు ఉండదని, టికెట్లు ఇచ్చే పూచీ తనదేనని చెప్పారు. టికెట్లు ఆశించిన వారంతా కష్టపడి పని చేయాలని సూచించారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్ఎస్ కు గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : జార్ఖండ్ సీఎంతో కేసీఆర్ ములాఖాత్