Revanth Reddy Slams : కేటీఆర్ స‌వాల్ రేవంత్ ప్ర‌తి స‌వాల్

రాహుల్ గాంధీని విమ‌ర్శించే హ‌క్కుందా

Revanth Reddy Slams : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంత్రి కేటీఆర్ పై మండిప‌డ్డారు. వ్య‌వ‌సాయం తెల్వ‌నోడు తెలిసిన‌ట్లు మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. తాను 3 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా మాత్ర‌మే ఇస్తాన‌ని అన్న‌ట్లు చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. కేటీఆర్ ప‌దే ప‌దే క‌ల్లు తాగిన కోతి లాగా దొమ్మ‌రి గంతులు వేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు రేవంత్ రెడ్డి.

వ్య‌వ‌సాయం అంటే అమెరికాలో అంట్లు తోమ‌డం కాద‌న్నారు. ఆయ‌న డ్రామా రావు అంటూ ఎద్దేవా చేశాడు. ఎవుసం చేయ‌డం అంటే జూబ్లి హిల్స్ గెస్ట్ హౌస్ ల‌లో సేద తీర‌డం కాద‌న్నారు. అస‌లు క్ల‌బ్బులు, ప‌బ్బుల్లో , గెస్ట్ హౌస్ ల‌లో తిరిగేది ఎవ‌రో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. తాను ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌న్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). సినిమా వాళ్ల‌తో పార్టీలు చేసుకోవ‌డం తెలియ‌దా అని పేర్కొన్నారు.

ఎడ్లు వ‌డ్లు అని ప్రాస కోసం పాకులాడిన కేటీఆర్ ముందు వెనుకా ఆలోచించు కోవాల‌ని సూచించారు. గాడిద కేం తెలుసు గంధ‌పు చెక్క‌ల వాస‌న అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌న్నారు. వేల కోట్లు అప్పులు చేసి విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని అంటున్నార‌ని, అదంతా అబ‌ద్ద‌మ‌న్నారు. కేసీఆర్ సురాపాన య‌జ్ఞం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని, కేసీఆర్ క‌రెంట్ అవినీతిని అంతం చేస్తుంద‌న్నారు రేవంత్ రెడ్డి.

Also Read : Sonia Gandhi DK : బెంగ‌ళూరుకు చేరుకున్న సోనియా

 

Leave A Reply

Your Email Id will not be published!