Revanth Reddy : పీకే నిర్వాకం కవిత నాటకం
అరెస్ట్ చేసేందుకు ఇంత సేపా
Revanth Reddy Kavitha : రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ పాలనకు మూడింది. ఈ తరుణంలో ఏం చేయాలంటే మైలేజ్ పెంచుకునేందుకు డ్రామాలు ఆడాలి. ఇదే ఇప్పుడు జరుగుతోంది. అడ్డగోలు ప్లాన్లు వేయడంలో అందె వేసిన చేయి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఆయన నిర్వాకం వల్లనే ఇవాళ రాష్ట్రంలో చెత్త రాజకీయాలు చోటు చేసుకున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).
లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంత సేపా విచారణ జరిపేది. మరి ఆధారాలు ఈడీ వద్ద ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ ప్రశ్నించారు. శనివారం పాదయాత్రలో భాగంగా షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదు కేసీఆర్ కు. పాలన పడకేసింది. పనులు అయితలేవు. ఉన్న తొమ్మిదేళ్లు దోచుకునేందుకు దాచుకునేందుకు మాత్రమే సరి పోయిందని ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్(Revanth Reddy Kavitha). ఇదంతా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న భారత రాష్ట్ర సమితి కలిసి ఆడుతున్న దొంగ నాటకం అంటూ మండిపడ్డారు.
ఆధారాలు ఉన్నాయంటూ ఈడీ పదే పదే చెబుతోంది. మరి అరెస్ట్ చేయాల్సింది పోయి విచారణ పేరుతో ఎందుకు నాన్చుతున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే నువ్వు తిట్టినట్టు చేయి నేను తిట్టినట్లు చేస్తా అన్నట్లుంది వీరిద్దరి వ్యవహారం అంటూ ఫైర్ అయ్యారు. రెండు పార్టీలు కలిసి జనాన్ని మోసం చేస్తున్నాయంటూ ఆరోపించారు.
Also Read : సిసోడియాకు జైల్లో రాచమర్యాదలు