Revanth Reddy : ఎవ‌రో తేల్చండి మా వాళ్లుంటే శిక్షించండి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్

Revanth Reddy : హైద‌రాబాద్ లో చోటు చేసుకున్న ర్యాడిస‌న్ హోట‌ల్, పుడింగ్ ప‌బ్ వ్య‌వ‌హారం రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఆ ప‌బ్ ను న‌డుపుతోంది బీజేపీ నాయ‌కురాలు ఉప్ప‌ల శార‌ద త‌న‌యుడిది.

ఇందులో ప‌ట్టుబ‌డిన వారిలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) మేన‌ల్లుడు ఉన్నాడ‌ని పోలీసులు ప్ర‌క‌టించ‌డంపై తీవ్రంగా స్పందించారు టీపీసీసీ చీఫ్‌. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఈ వ్య‌వ‌హారంలో నా కూతురు, లేదా నా కుటుంబానికి చెందిన వారు ఏ ఒక్క‌రు ఉన్నా వెంట‌నే డిక్లేర్ చేయండి. వారిని జైలుకు పంపించండి అని సవాల్ విసిరారు.

త‌న‌కు చెందిన వారున్నారంటూ టీఆర్ఎస్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై మండిప‌డ్డారు. తాను రాహుల్ గాంధీతో ఢిల్లీలో ముఖ్య‌మైన మీటింగ్ ఉండ‌డం వ‌ల్ల ఇవాళ ఇక్క‌డికి వ‌చ్చాన‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు కేసీఆర్ స‌ర్కార్ కు. దాడి చేసిన ప‌బ్ కు 24 గంట‌ల పాటు ప‌ర్మిష‌న్ ఇచ్చింది ఎవ‌ర‌ని అన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ఇచ్చి ఇప్పుడు త‌మ‌పై దాడికి దిగితే ఎలా అని నిల‌దీశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). 125 మందికి టెస్టులు చేయ‌కుండా ఎందుకు వ‌దిలి వేశారంటూ ప్ర‌శ్నించారు టీపీసీసీ చీఫ్‌.

పిల్ల‌ల‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం మాను కోవాల‌ని మండిప‌డ్డారు. మా వాళ్ల‌ను అంద‌రినీ తీసుకు వ‌స్తా. కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్ ను కూడా డ్ర‌గ్స్ కు టెస్టుకు పంపిస్తావా అంటూ స‌వాల్ విసిరారు.

త‌మ‌కు కావాల్సిన వాళ్ల‌ను ప్ర‌భుత్వం కావాల‌నే వ‌దిలి వేస్తుంద‌న్నారు.

Also Read : అమిత్ షాతో భేటీ కానున్న త‌మిళి సై

Leave A Reply

Your Email Id will not be published!