Revanth Reddy : వెంకన్నా తప్పైంది మన్నించు – రేవంత్
టీపీసీసీ చీఫ్ బహిరంగ ప్రకటన
Revanth Reddy : ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగి వచ్చారు. గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి రేవంత్ రెడ్డితో పాటు మరో సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ పరుష, బూతు పదజాలం వాడారు.
ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీనిపై తీవ్రంగా స్పందించారు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. బేషరత్తు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం గురించి తాను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో మాట్లాడారు.
దీంతో ఈ వివాదం మరింత రచ్చగా మారింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కోమటిరెడ్డి బ్రదర్స్(Revanth Reddy) . కేవలం కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
చండూరు సభలో అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే, ఎంపీపై తీవ్రమైన బూతు పదం వాడారు. దీంతో ఏఐసీసీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ ఆరా తీసింది.
ఇలాంటి కామెంట్స్ ఇక నుంచి వాడవద్దని ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారంటూ నిలదీసినట్లు సమాచారం. దీంతో కోవిడ్ ఎఫెక్ట్ అయిన రేవంత్ రెడ్డి శనివారం వీడియో ద్వారా సందేశం వినిపించారు .
ఈ మేరకు తాను బహిరంగంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు.
Also Read : ఏపీలో ఎన్నికలు జరిగితే జగన్ దే హవా