Revanth Reddy CEO : సీఈవోకు సీఎంపై ఫిర్యాదు
వినతి పత్రం ఇచ్చిన టీపీసీసీ చీఫ్
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ వికాస్ రాజ్ ను కలుసుకున్నారు. ఆయన సారథ్యంలో టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు మధు యాష్కి గౌడ్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ , జి. నిరంజన్ , తదితరులు సీఈవోకు ఫిర్యాదు చేశారు.
Revanth Reddy Complaint Viral
వికాస్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కలిసిన అనంతరం. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం రూల్స్ ను పూర్తిగా ప్రస్తుతం కొలువు తీరిన సీఎం కేసీఆర్ , సర్కార్ పాటించ లేదంటూ ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 6,000 కోట్ల రైతు బంధుకు సంబంధించి విడుదల చేయాల్సిన డబ్బులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు మళ్లిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్కార్ జరుపుతున్న లావా దేవీలపై నిఘా పెట్టాలని కోరారు. సీఈవో వెంటనే నిలిపి వేయాలని కోరుతూ ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు.
ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని వారిని తాము ఉపేక్షించ బోమంటూ స్పష్టం చేశారు. తాము పవర్ లోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్