Revanth Reddy : రేపు జీహెచ్ఎంసీ ముట్టడి – టీపీసీసీ
వెల్లడించిన ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం నానా తంటాలు పడుతోంది. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. మరో వైపు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Revanth Reddy Says
మరో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న హెచ్చరించారు. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీ మీటర్ల వరకు వర్షాలు వస్తాయని నగర వాసులు భద్రంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర పాలక సంస్థ పని తీరు సరిగా లేదంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు జూలై 28న శుక్రవారం జీహెచ్ఎంసీని ముట్టడించాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy).
ముంపు బాధితులకు కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు రేవంత్ రెడ్డి. రేపు ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
Also Read : M Hari Krishna : బౌద్ధం ప్రాతః స్మరణీయం – హరికృష్ణ
