Revanth Reddy : రేవంత్ కు అపూర్వమైన ఆదరణ
గాంధీ భవన్ కు టీపీసీసీ చీఫ్
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండడంతో భారీ ఎత్తున పార్టీకి చెందిన నాయకులు, శ్రేణులు సంబురాలలో మునిగి పోయారు. పార్టీని విజయ పథంలోకి నడిపించి, అన్నీ తానై వ్యవహరించిన టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీతో బయలు దేరారు నాంపల్లి లోని గాంధీ భవన్ కు.
Revanth Reddy Got Blessings
డీజీపీ అంజనీ కుమార్ , అడిషనల్ డీజీపీ, తెలంగాణ సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ , సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ సైతం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీగా బయలు దేరిన రేవంత్ రెడ్డికి(Revanth Reddy) అడుగడుగునా నీరాజనం పలికారు. ఎక్కడ చూసినా రేవంత్ జిందాబాద్ , కాంగ్రెస్ కు జై అన్న నినాదాలతో మారు మ్రోగి పోయాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన రేవంత్ రెడ్డి తనను ఆశీర్వదించాలని కోరుతూ వచ్చారు. ప్రజలను ఉద్దేశించి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మరో వైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నీ తానై వ్యవహరించారు.
మొత్తం మీద చివరి దాకా ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు హస్తగతం కానుంది.
Also Read : Telangana CID Chief : టీపీసీసీ చీఫ్ తో సీఐడీ చీఫ్ భేటీ