Gandhi Bhavan Dharna : గాంధీ భవన్ లో ధర్నా చేస్తే సస్పెండ్
వార్నింగ్ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Gandhi Bhavan Dharna : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. గాంధీ భవన్ వద్ద శనివారం తుర్కపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంటనే ఆందోళన విరమించాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్యను ఆదేశించారు.
ఇదిలా ఉండగా గాంధీ భవన్ వద్ద నిరసనకు దిగిన వారి వివరాలు వెంటనే తెలుసు కోవాలని రేవంత్ సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మొన్నటి వరకు మండల కమిటీ చీఫ్ గా ఉన్న శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. గాంధీ భవన్ మెట్లపై ఇక నుంచి ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి కాంగ్రెస్(Congress) పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా. చాలా సార్లు నేతలు, కార్యకర్తలు సీట్ల విషయంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా కొలువు తీరాక గాంధీ భవన్ లో కీలక మార్పులు చేశారు.
వాస్తు ప్రకారంగా మార్పులు చేశారు. కార్పొరేట్ కంపెనీల తరహాలో ఆఫీసును తీర్చి దిద్దారు. టెక్నాలజీని అనుసంధానం చేశారు. ఈ తరుణంలో ఇవాళ చోటు చేసుకున్న ఘటన ఒకింత విస్తు పోయేలా చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులను.
Also Read : Nara Lokesh : గంజాయిపై గవర్నర్ కు ఫిర్యాదు – లోకేశ్