Revanth Reddy Win : కోడంగల్ లో రేవంత్ విక్టరీ
బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం
Revanth Reddy Win : హైదరాబాద్ – రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. కోడంగల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో బరిలో నిలిచారు. ఇది ఊహించని షాక్ . రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కామారెడ్డిలో వెనుకంజలో ఉన్నారు.
Revanth Reddy Win Viral
ఇక రేవంత్ రెడ్డికి కంచు కోటగా ఉన్న కోడంగల్ లో గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. తన సమీప బీఆర్ఎస్ పార్టీకి చెందిన పట్నం నరేందర్ రెడ్డిపై ఏకంగా 32 వేల 800 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. విజయ బావుటా ఎగుర వేశారు. మరో వైపు కామారెడ్డిలో 4 వేల మెజారిటీతో ముందుకు వెళుతున్నారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీ, ప్రదర్శనతో గాంధీ భవన్ వద్దకు చేరుకున్నారు. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 119 సీట్లకు గాను 65 సీట్లకు పైగా కైవసం చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని సాధించింది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అరాచక, అవినీతి పాలనకు చరమ గీతం పాడారని ఇది ప్రజల విజయం అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Also Read : Revanth Reddy : రేవంత్ కు అపూర్వమైన ఆదరణ