Revanth Reddy : కోస్గి – తనను ఓడించేందుకు సర్వ శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జనం వచ్చారు. వారందరినీ ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తనను రాజకీయంగా లేకుండా చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం గంప గుత్తగా కలిసి వచ్చినా తనను ఏమీ చేయలేరని అన్నారు.
Revanth Reddy Hopes
తనను ఓడించే దమ్ము , ధైర్యం వాళ్లకు ఎవరికీ లేదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). రెండుసార్లు మీరు నాపై నమ్మకం ఉంచి గెలిపించారని, ఈసారి కూడా అదే రీతిన తనకు విజయం అందించాలని కోరారు. మీరు పెంచిన మొక్క వృక్షమై ఎదిగిందని, అది ఇవాళ టీపీసీసీ చీఫ్ పదవిని అలంకరించేలా చేసిందన్నారు టీపీసీసీ చీఫ్.
సిద్దిపేట నుంచి ఒకడు, సిరిసిల్ల నుంచి మరొకడు, గజ్వేల్ నుంచి ఇంకొకడు గొడ్డళ్లు తీసుకుని కోడంగల్ కు బయలు దేరారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానన్న కోడంగల్ కు ఈ ఐదేళ్లలో ఏం చేశాడో చెప్పాలని కేసీఆర్ ను నిలదీశారు.
Also Read : Jana Reddy : జానా రెడ్డికి బిగ్ షాక్