Sukhwinder Singh Sukhu : పాత పెన్షన్ స్కీమ్ పనరుద్ధరణ
స్పష్టం చేసిన ఎస్ఎస్ సుఖు
Sukhwinder Singh Sukhu : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సంచలన ప్రకటన చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్దరిస్తున్నట్లు స్పష్‌టం చేశారు సీఎం. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి పాత పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఈ స్కీమ్ ను పునరుద్దరించడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ. 800 కోట్ల నుంచి రూ. 900 కోట్లు ఖర్చు అవుతుంది. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు సీఎం సుఖు(Sukhwinder Singh Sukhu). దీనిని మైలు రాయిగా పేర్కొన్నారు . ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
ఇక పాత పెన్షన్ స్కీమ్ విధానం వల్ల దాదాపు 1 లక్షా 36 వేల మందిని ప్రభావితం చేయనుందని పేర్కొన్నారు సుఖ్విందర్ సింగ్ సుఖు. ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఈ ఉత్తర్వు వెంటనే అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు సీఎం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
అంతే కాకుండా సీఎం మరో సంచలన ప్రకటన చేశారు. మహిళలకు నెలకు రూ. 1,500 అందజేస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడించారు. 30 రోజుల్లోగా రోడ్ మ్యాప్ ను సిద్దం చేసేందుకు మంత్రుల ప్యానెల్ ను ఏర్పాటు చేశామన్నారు సుఖ్విందర్ సింగ్ సుఖు.
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ , జార్ఖండ్ , పంజాబ్ లు పాత పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
Also Read : రాహుల్ యాత్ర ముగింపు సభపై ఫోకస్