Bhagat Singh : విప్లవం అంటే విందు భోజనం కాదు. అది పవిత్ర యుద్దం. సమున్నత లక్ష్యం కోసం సాగే పోరాటం. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదం దేశాన్ని ఊపేసింది.
అన్యాయం పేట్రేగుతున్న సమయంలో యుద్దం అనివార్యం కాక తప్పదు. అదే భగత్ సింగ్(Bhagat Singh) చేశాడు. ఆయనపై అనార్కిజం, మార్క్సిజం ప్రభావం ఉంది. బకునిన్, కార్ల్ మార్క్స్ , ట్రాటస్కీల రచనలు అంటే ఇష్టం. గాంధేయవాదంపై నమ్మకం లేదు.
దోపిడీదారుల్ని మారుస్తుందే కానీ దోపిడీని నిర్మూలించ లేదన్నాడు. పంజాబ్ వార్తా పత్రిక కీర్తిలో ప్రత్యేక కథనాలు రాశాడు. అరాచకత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేదని పేర్కొన్నాడు భగత్ సింగ్(Bhagat Singh). కమ్యూనిజం పట్ల ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు.
భారత దేశంలో ప్రథమ మార్క్సిస్టు భగత్ సింగ్ అని చరిత్రకారుడు కేఎన్ ఫనిక్కర్ తెలిపాడు. నీ ఆఖరి కోరిక ఏమిటంటే లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నానని, చని పోయే లోగా దానిన పూర్తి చేయాలని ఉందన్నాడు భగత్ సింగ్.
యుక్త వయసులో ఆర్య సమాజ్ ప్రభావం ఉన్నా తర్వాత నాస్తికుడిగా మారి పోయాడు. సర్వ శక్తుడిగా భావించే దేవుడి పట్ల తనకు నమ్మకం లేదన్నాడు భగత్ సింగ్. తన ఉరి తీత గురించి ప్రస్తావించాడు.
విప్లవాన్ని కాంక్షించే వాళ్లను ఉరి తీయగలరు. వ్యక్తులను నిర్మూలించ గలరు. కానీ వారి సిద్దాంతాలను, నమ్మకాలను, ఆశయాలను నిర్మూలించ లేరన్నాడు భగత్ సింగ్.
ఉరి కొయ్యలను చిరునవ్వుతో స్వీకరించిన యోధుడు అతడు. విప్లవం అంటే విందు భోజనం కాదని అది పవిత్ర లక్ష్యం కోసం సాగే ప్రస్థానం అని ప్రకటించాడు భగత్ సింగ్.
Also Read : అసంతృప్త నేతలతో మేడం భేటీ