#CaronaVirus: అదీ ఆర్జీవీ టైమింగ్ అంటే..

అక్టోబరు 15, థియేటర్లలో విడుదలయ్యే మొదటి సినిమా..ఆర్జీవీ ‘కరోనా వైరస్’..

Carona Virus : సినిమా సినిమాకి ఒక కథ ఉంటుంది.. సినిమా సినిమాకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. కానీ రాంగోపాల్ వర్మ దగ్గరకు వచ్చేసరికి సినిమా సినిమాకి సెన్సేషన్ ఉంటుంది. అదీ సినిమా డైలాగ్ స్టయిల్ లో చెప్పాల్సి వస్తే.. ‘డబ్బులొచ్చాయా ? లేదా’ అన్నది కాదన్నయ్యా.. సెన్సేషన్ అయ్యిందా లేదా?..ఇదే కాన్సెప్ట్..రాంగోపాల్ వర్మ సినిమాలన్నీ ఇదే కోవలో ఉంటాయి..అయితే ఒక్క మాట చెప్పుకోవాలి.. సినిమా ఎలా తీశాడన్నది కాదు.. సినిమాని విడుదల కాకుండానే ఎలా సెన్సేషన్ చేయవచ్చో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు.

నిజానికి అది ఆర్జీవీలో ఉన్న గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఒక క్రియేటివిటీ ఉన్న దర్శకుడు..తన సినిమా ప్రమోషన్ ను ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా అందిస్తే ఎక్కుతుందో ఆ తరహాలో చేసి సక్సెస్ చేయాలని అనుకుంటాడు. అలా తను తీసే సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేస్తాడు. ఎవరికైనా మండి..

ఏంటయ్యా..నువ్వేటి..నీ సినిమాలేటి?  అని  పొరపాటున అడిగితే..

‘నిన్నెవడు చూడమన్నాడు?’

అని తిరిగి ప్రశ్నిస్తాడు..అందువల్ల ఆయన గురించి తక్కువే మాట్లాడుకోవాలి.

ఇకపోతే వచ్చింది కరోనా వైరస్..లాక్ డౌన్ అయ్యింది అందుకే..ఇంకా మందు కనిపెట్టలేదు..అయినా అన్ లాక్ 5 లో భాగంగా 50పర్సంట్ రేషియోలో థియేటర్లు తెరుచుకోవచ్చునని అవకాశమిచ్చారు. అయితే అదృష్టమో, దురదృష్టమో తెలీదు.. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న చందంగా..ఈ టైమ్ లో శుభమా అని థియేటర్లు తెరుస్తుంటే ఈ సినిమాతో ప్రారంభించడమేంట్రా బాబూ..మా ఖర్మ కాకపోతే అనుకుంటున్నారు. ఇదండీ సంగతి.. అక్టోబరు 15 థియేటర్లు తెరుచుకుంటాయి..కరోనా వైరస్ సినిమాతో ఆట మొదలవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అనుకున్నవన్నీ అనుకున్నట్టు సక్రమంగా జరిగితేనే సుమా..

 

Leave A Reply

Your Email Id will not be published!