Rishi Sunak Janmashtami : జన్మాష్టమి వేడుకల్లో రిషి సునక్
ఆలయంలో పూజలు చేసిన భార్య
Rishi Sunak Janmashtami : బ్రిటన్ దేశ ప్రధాన మంత్రి రేసులో ఉన్న భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ వ్యాపారవేత్త, దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునక్ తన భార్య అక్షతతో కలిసి జన్మాష్టమి వేడుకల్లో(Rishi Sunak Janmashtami) పాల్గొన్నారు.
బ్రిటన్ లో శ్రీకృష్ణుడి పుట్టిన రోజు సందర్భంగా ఆలయంలో పూజలు చేశారు. ఆయన ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కి అల్లుడు. కూతురు అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నారు.
సౌతాంప్టన్ లో పుట్టిన రిషి సునక్ ప్రస్తుతం ఒపీనియన్ పోల్స్ లో దేశ విదేశాంగ మంత్రి గా ఉన్న లిజ్ ట్రస్ కంటే కాస్తా వెనుకబడి ఉన్నారు.
కాగా ఇటీవల జరిగిన నాలుగు రౌండ్ల పోల్ లో రిషి సునక్(Rishi Sunak) అందరికంటే ముందంజలో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత ఒపినీయన్ పోల్స్ లో వెనుకబడడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా జన్మాష్టమి సందర్భంగా తన భార్యతో కలిసి ఆలయాన్ని సందర్శించడం , పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు రిషి సునక్.
ఇదే విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ కలిసి పూజలు చేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి.
లండన్ లో భక్తి ప్రభుపాదుల వారి ఆశీర్వాదంతో ఏర్పాటైన భక్తి వేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించుకున్నాం. ఇది నిజంగా నా జీవితంలో మరిచి పోలేని రోజుగా ఉంటుందన్నారు రిషి సునక్.
Also Read : జన్మాష్టమి పుణ్య మార్గానికి ప్రేరణ