Rishi Sunak Visas : భారతీయుల‌కు రిషి సున‌క్ ఖుష్ క‌బ‌ర్

వీసాలు ఇచ్చేందుకు లైన్ క్లియ‌ర్

Rishi Sunak Visas : భార‌త సంతతికి చెందిన రిషి సున‌క్ యుకె ప్ర‌ధాన‌మంత్రిగా ఎన్నిక‌య్యాక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఇండోనేషియాలోని బాలిలో జీ20 శిఖార‌గ్ర స‌ద‌స్సు జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా 19 దేశాల‌కు చెందిన అధ్య‌క్షులు, ప్ర‌ధాన‌మంత్రులు హాజ‌ర‌య్యారు.

ఇందులో భాగంగా భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో రిషి సున‌క్ భేటీ అయ్యారు. కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఇరు దేశాల మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా స‌త్ సంబంధాలు కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. ఇదే క్ర‌మంలో అటు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిట‌న్ కు ఎక్కువ‌గా వెళ్లే వారిలో అత్య‌ధిక శాతం భార‌తీయులే ఉన్నారు.

ఇప్ప‌టికి ఇంకా వీసాల మంజూరీలో తీవ్ర జాప్యం జ‌రుగుతోంది. దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్. ఇక వృత్తి ప‌ర‌మైన నిపుణుల‌కు పెద్ద ఎత్తున ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు హామీ ఇచ్చారు యుకె పీఎం రిషి సున‌క్. ప్ర‌తి ఏటా 3,000 మందికి వీసాలు ఇచ్చేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ప్ర‌ధాన మంత్రి(Rishi Sunak Visas).

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది యూకే, ఇండియా మైగ్రేష‌న్ అండ్ మొబిలిటీ ఒప్పందంలో భాగంగా ఈ ప‌థ‌కం నుంచి ల‌బ్ది పొందిన తొలి దేశం భార‌త్ అని వెల్ల‌డించారు యుకె పీఎం రిషి సున‌క్. ఇందుకు సంబంధించి అధికారికంగా యుకె పీఎం కార్యాల‌యం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ స‌మాచారాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది.

యుకె పీఎం ప్ర‌క‌ట‌న‌తో భార‌తీయులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : పోలాండ్ స‌రిహ‌ద్దుల్లో రాకెట్ దాడి

Leave A Reply

Your Email Id will not be published!