PM Modi Rishi Sunak : జి20 సదస్సులో రిషి సునక్..మోదీ భేటీ
జి20 సదస్సులో చర్చలు
PM Modi Rishi Sunak : జి20 సమ్మిట్ లో భాగంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరుగుతోంది సమ్మిట్. ఈ సదర్బంగా ఇటీవలే నూతనంగా యుకె పీఎంగా ఎన్నికైన రిషి సునక్ తో(PM Modi Rishi Sunak) భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ఈ ఇద్దరు కీలక అంశాలపై చర్చించారు. మరో వైపు చైనా దేశ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన జిన్ పింగ్ తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. కానీ ఎక్కువ సేపు మాట్లాడుకోలేదు. మంగళవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఇద్దరు ప్రధానులు అనధికారిక చర్చలు జరిపారు.
అనేక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. గత నెలలో రిషి సునక్ అధికారం చేపట్టాక జరిగిన మొదటి ముఖాముఖి సంభాషణ. ఇదిలా ఉండగా భారత దేశం ఈ ఏడాది డిసెంబర్ 1 నుండి ఒక సంవత్సరం పాటు జి20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. జి20లో 19 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ , కెనడా, చైనా, ఫ్రాన్స్ , జర్మనీ , ఇండియా , ఇండోనేషియా, ఇటలీ, జపాన్ , దక్షిణ కొరియా, మెక్సీకో, రష్యా , సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యుఎస్ఏ, ఈయు ఉన్నాయి. ఇదిలా ఉండగా అంతకు ముందు ఇరువురు ప్రధానులు సునక్, మోదీలు ఫోన్ లో మాట్లాడుకున్నారు.
ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ యుద్దం గురించి ప్రస్తావించారు. ఇక సునక్ తో పాటు సెనగల్ చీఫ్ మాకీ సాల్ , నెదర్లాండ్స్ పీఎం మార్క్ రుట్టే, అమెరికా చీఫ్ బైడెన్ ను కలిశారు.
Also Read : మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా తుక్రాల్