Rishi Sunak : పీఎంగా ఎన్నికైతే ఇక చైనాకు చుక్కలే
యుకె పీఎం రేసులో ఉన్న రిషి సునక్
Rishi Sunak : యూకే పీఎం రేసులో ఉన్న ప్రవాస భారతీయుడు, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తిల అల్లుడైన రిషి సునక్(Rishi Sunak) సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్లలో ఆయన ముందంజలో నిలిచారు.
సెప్టెంబర్ 5న యూకే పీఎంగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా రిషి సునక్ తన ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా జరిగిన సమావేశంలో తాను గనుక బ్రిటన్ కు ప్రధాన మంత్రి అయితే చైనాకు చుక్కలు చూపిస్తానని స్పష్టం చేశాడు. ఆ దేశం పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తానని చెప్పాడు.
ప్రస్తుతం ఆసియా అగ్ర రాజ్యంగా కొనసాగుతోంది డ్రాగన్ . ఒక్క బ్రిటన్ కే కాదు యావత్ ప్రపంచానికి ఆ దేశం ఓ ముప్పు లాగా మారిందని సంచలన కామెంట్స్ చేశాడు రిషి సునక్(Rishi Sunak).
దాని వల్ల ప్రపంచ భద్రతకు పెను ముప్పు ఏర్పడిందన్నారు. పాలక కన్జర్వేటివ్ పార్టీకి నాయకత్వం ఎవరు వహించరున్నానేది అటు చైనా ఇటు అమెరికా ఎదురు చూస్తోంది.
ప్రస్తుతం తనకు పోటీగా బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసిన లిజ్ ట్రస్ గట్టి పోటీ ఇస్తున్నారు. వీరిద్దరి మధ్య అసలైన వార్ నడుస్తోంది.
చివరి దాకా రెండో పొజిషనల్ నిలిచిన పెన్నీ మార్టాండ్ ఉన్నట్టుండి ఆఖరి నాలుగో రౌండ్ లో కొద్ది తేడాతో ట్రస్ తో వైదొలిగారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రిషి సునక్ చైనాపై చేసిన వ్యాఖ్యలు బ్రిటన్ లోనే కాదు చైనాలో కూడా కలకలం రేపుతున్నాయి.
Also Read : మిచిగాన్ యూనివర్శిటీలో కలకలం