Rishi Sunak PM : బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఎన్నిక
దేశ చరిత్రలో ప్రవాస భారతీయుడు
Rishi Sunak PM : బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ముగిసింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ యుకె ప్రధాన మంత్రిగా కొలువు తీరారు. చివరి వరకు మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తో పాటు పెన్నీ మార్డెంట్ నిలిచారు. ఉన్నట్టుండి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు బోరీస్ జాన్సన్ .
ఇక ప్రధానమంత్రి అయ్యేందుకు కావాల్సిన మెజారిటీని సాధించ లేక పోయారు మరో పోటీదారుగా ఉన్న పెన్నీ మార్డెంట్ . ఇదిలా ఉండగా గత 45 రోజుల కిందట జరిగిన కీలక పోటీలో ఇదే రిషి సునక్(Rishi Sunak PM) పై లిజ్ ట్రస్ విజయం సాధించారు ప్రధానమంత్రిగా కొలువు తీరారు. కానీ ఆరు వారాల తర్వాత తాను దేశాన్ని పాలించ లేనట్లు ప్రకటించారు.
ఆపై తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఎవరు ఎన్నికవుతారనే దానికి తెర దించారు అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సభ్యులు. ఈ మేరకు భారీ ఎత్తున రిషి సునక్ ప్రధాన మంత్రి కావడానికి సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో ఆయన బ్రిటన్ ప్రధానమంత్రిగా కొలువు తీరనున్నారు.
ఆయన పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ సందర్బంగా స్టాక్ మార్కెట్ పాజిటివ్ దృక్ఫథంతో దూసుకు పోతోంది. ఇదంతా రిషి సునక్ పీఎం అవుతారన్న పాజిటివ్ ప్రచారం దోహద పడిందనే చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా రిషి సునక్ ఎవరో కాదు ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయమూర్తికి స్వంత అల్లుడు కావడం విశేషం.
Also Read : రిషి సునక్ కు మెజారిటీ ఎంపీల మద్దతు