Mokama By Poll : మొకామాలో బీజేపీకి షాక్ ఆర్జేడీ విజయం
సోనమ్ దేవిపై నీలం గ్రాండ్ విక్టరీ
Mokama By Poll : బీహార్ లో 17 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న జనతాదళ్ యూ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆర్జేడీ చీఫ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఖుష్ కబర్ లభించింది. ఇక్కడ కేంద్రంలోని బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఒక రకంగా బీహార్ లో ఈ ఉప ఎన్నిక ఒక పాఠంగా మారింది.
మొకామా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో(Mokama By Poll) రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అభ్యర్థి నీలం దేవి గెలుపొందారు. తన సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోనమ్ దేవిపై భారీ ఆధిక్యంతో నీలం దేవి విక్టరీ సాధించారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది.
ఒక రకంగా చేతులెత్తేసింది అని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా నీలం దేవికి 79,744 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవికి 63,003 ఓట్లు పోల్ అయ్యాయి. కాగా మొకామాలో ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ నివాసంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడంతో కోర్టు దోషిగా నిర్దారించింది.
ఇదే ఏడాది 2022లో జూలైలో అనంత్ పై ఎన్నికల సంఘం డిస్ క్వాలిఫై వేటు వేసింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆర్జేడీ అభ్యర్థిగా అనంత్ సింగ్ భార్య నీలం దేవిని నిలబెట్టింది. బీజేపీ సోనమ్ దేవిని నిలిపింది.
ఉప ఎన్నిక ముగిసిన అనంతరం ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఆర్జేడీకి భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టారని స్పష్టం చేశారు.
Also Read : ఆదంపూర్ ఉప ఎన్నికలో బీజేపీ విక్టరీ