RK Roja Pawan : పవన్ బాధిత మహిళల లెక్కలు తేల్చండి
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
RK Roja Pawan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
RK Roja Pawan Discussion
ఏపీలో మహిళలు, బాలికలు, యువతులు మిస్సింగ్ అయ్యారని వారి లెక్కలు తేల్చాలంటూ తాజాగా పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు. దీంతో తమ ముఖ్యమంత్రిని మిస్సింగ్ వివరాలు అడుగుతున్న పవన్ కళ్యాణ్ ముందు నీ ద్వారా బాధితులైన మహిళలు కనిపించకుండా పోయారని , దమ్ముంటే వారి వివరాలను బయట పెట్టాలని ఏపీ మంత్రి డిమాండ్ చేశారు.
పవన్ వల్ల లెక్కకు మించిన అమ్మాయిలు మోసానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కారణంగా అదృశ్యమైన వారికి సంబంధించిన లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు ఆర్కే రోజా(RK Roja). ఏపీలో మహిళల మిస్సింగ్ పై ఏ నిఘా సంస్థ పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం పని లేకుండా పోయిందన్నారు. ఆయనను గైడ్ చేస్తున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతగా చించుకున్నా ఒరిగేది ఏమీ ఉండదన్నారు ఆర్కే రోజా. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.
Also Read : MLC Jeevan Reddy : ఉత్తమ్ పై జీవన్ రెడ్డి కామెంట్స్