RK Roja : సీఎం ప్రయత్నం ఉద్యోగ విజయోత్సవం
ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా
RK Roja : రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja). పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని పిళ్లారిపట్టు పాలిటెక్నిక్ కాలేజీలో మంగళవారం జరిగిన ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ది చేశామని, ఇవాళ తనకు చాలా సంతృప్తిని కలిగించిందని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి. సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, వారిలో నైపుణ్యాలను అభివృద్ది చేయడం, క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించడం , ఉద్యోగాలు వచ్చేలా చేసినందుకు వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు ఆర్కే రోజా సెల్వమణి.
వివిధ కంపెనీలలో 62 మందికి ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందన్నారు. శిక్షణ ఇస్తున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే శిక్షణ వల్ల ఏడాదికి లక్షా 80 వేల నుండి 2 లక్షల 60 వేల దాకా వేతనాలు పొందుతున్నారని స్పష్టం చేశారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యా, ఉపాధి రంగాలపై సీఎం జగన్ రెడ్డి ఫోకస్ పెట్టారని తెలిపారు. నాడు నేడు కార్యక్రమం దేశానికే తలమానికంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగంలో 6 లక్షల జాబ్స్ ఇచ్చామని, లక్షా 50 వేల సచివాలయ ఉద్యోగాలు, 4 వేలకు పైగా టీచర్ పోస్టులు, 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పారు ఆర్కే రోజా(RK Roja) సెల్వమణి. వీటితో పాటు 49 వేల ఉద్యోగులను వైద్య రంగంలో భర్తీ చేశామన్నారు. 175 నియోజకవర్గాల్లో స్కిల్ హబ్ లు ఏర్పాటు చేశామన్నారు.
Also Read : తెర మీదే కాదు తెర వెనుక కూడా నటుడే