RK Roja Selvamani : విద్యార్థుల పాలిట జగనన్న దేవుడు
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
RK Roja Selvamani : ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నగరిలో జగనన్న విద్యా పథకం కింద సీఎం వైఎస్ జగన్ విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్కే రోజా పాల్గొని ప్రసంగించారు.
RK Roja Selvamani Comments Viral
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యాభివృద్దికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రత్యేకించి విద్యా రంగంలో సమూల మార్పులు చేశారని అన్నారు. అంతే కాకుండా నాడు నేడు కింద వేలాది స్కూల్స్ లలో మౌలిక వసతి సదుపాయాలను ఏర్పాటు చేశారని తెలిపారు ఆర్కే రోజా సెల్వమణి.
ఈ ఒక్క నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులకు మేలు చేకూరుతోందని అన్నారు . గత ప్రభుత్వ హయాంలో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కానీ జగన్ రెడ్డి సీఎంగా వచ్చాక సీన్ మారిందన్నారు.
కేవలం విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani). ప్రస్తుతం కోట్లాది రూపాయలు ఈ రెండు రంగాలకు కేటాయించిన ఘనత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు .
Also Read : Mynampally Hanumantha Rao : మైనంపల్లిపై వేటుకు సిద్ధం