RK Roja Selvamani : క్రీడలకు ఏపీ సర్కార్ పెద్దపీట
పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
RK Roja Selvamani : అమరావతి – క్రీడా రంగానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని స్పష్టం చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి అన్నారు. రాష్ట్ర క్రీడా చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో గ్రామాల నుండి పట్టణ స్థాయి వరకు 15 సంవత్సరాలు పైబడిన (మహిళలు, పురుషులు) అందరూ క్రీడా పోటీల్లో భాగస్వాములయ్యేలా ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
RK Roja Selvamani Comment
యువతలో క్రీడాస్పూర్తిని పెంపొందించేందుకు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్ లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani). విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతి ఇవ్వనుందని స్పష్టం చేశారు.
క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలి పెంపొందించడం, క్రీడా నైపుణ్యాన్ని , ప్రోత్సహించడం ప్రతిభావంతులైన క్రీడాకారులను కనుగొని వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికకు పరిచయం చేయడం ఈ ఈవెంట్ యొక్క ముఖ్య నినాదమని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి.
ఇంకా ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనాలని అనుకుంటే డిసెంబర్ 13 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించి సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయం లో, వాలంటీర్ల ద్వారా, ఆన్ లైన్ లో https://aadudamandhra.ap.gov.in వెబ్సైటు ద్వారా లేదా 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
Also Read : BRS Win Again : బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా