RK Roja Selvamani : బావ కోసం బాలకృష్ణ మీసం
ఏపీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : గుంటూరు – ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాలలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు. ఒక సభ్యుడిగా తన స్థాయిని మరిచి పోవడం విడ్డూరమని పేర్కొన్నారు.
RK Roja Selvamani Comments on Balakrishna
ప్రజలు అసెంబ్లీని దేవాలయంగా భావిస్తారని, ఆ విషయం తెలుసుకోక పోవడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani ). శాసనసభను సైతం ఆయన సినిమా సెట్టింగ్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేవలం జైలులో ఉన్న తన బావ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కళ్లల్లో ఆనందం కోసమే బాలకృష్ణ మీసం తిప్పాడంటూ సెటైర్ వేశారు ఆర్కే రోజా సెల్వమణి. ఈ మీసం తిప్పడం, తొడలు కొట్టడం లాంటి పనులు ఆనాడు తన తండ్రి, దివంగత సీఎం ఎన్టీఆర్ పై చెప్పులు విసిరిన సమయంలో చేసి ఉంటే బావుండేదని పేర్కొన్నారు.
వెన్ను పోటు పొడిచిన వాళ్లకు షాక్ ఇచ్చి ఉంటే ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరి ఉండేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : Rahul Gandhi : రైల్వే కూలీలతో రాహుల్ గాంధీ
