RK Roja : జ‌గ‌న్ సింహం లాంటోడు – ఆర్కే రోజా

త‌ట్టుకోవ‌డం క‌ష్టం ప‌వ‌న్ క‌ళ్యాణ్

RK Roja : ఏపీ ప‌ర్యాట‌క శాఖా మంత్రి ఆర్కే రోజా నిప్పులు చెరిగింది. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేసింది. ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించే నైతిక హ‌క్కు ప‌వ‌న్ కు లేద‌న్నారు. ఏం ముఖం పెట్టుకుని , ఏం సాధించార‌ని వారాహి విజ‌య యాత్ర నిర్వ‌హిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు ఆర్కే రోజా(RK Roja). జ‌నం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌వ‌ర్త‌న‌ను చూసి, ఆయ‌న వాడుతున్న భాష‌ను చూసి సిగ్గుతో త‌ల దించుకుంటున్నార‌ని పేర్కొన్నారు.

ముందూ వెనుకా చూడ‌కుండా ఎడా పెడా మాట్లాడ‌టం మాత్ర‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలిసిన విద్య అన్నారు. జ‌గ‌న్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శిస్తే నాయ‌కుడై పోతావా అని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ రెడ్డి మామూలోడు కాదు. ద‌మ్మున్నోడు..జ‌నం విలువ తెలిసినోడు. ఆయ‌న సింహం లాంటోడు. ద‌మ్ముంటే ధైర్యంగా ఎదుర్కో కానీ..అన‌వ‌స‌రంగా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు ఆర్కే రోజా.

అస‌లు స్పృహ‌లో ఉండే మాట్లాడుతున్నావా అని ప్ర‌శ్నించారు ఆర్కే రోజా. ప్ర‌భుత్వ ప‌రంగా అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు ఇవాళ పేద‌ల‌కు చేరుతున్నాయంటే వాలంటీర్ల వ‌ల్ల‌నేన‌ని మ‌రోసారి గుర్తు చేశారు. ఇక‌నైనా ఆధారాల‌తో మాట్లాడాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రోజా హిత‌వు చెప్పారు.

Also Read : AP CM YS Jagan : ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

 

Leave A Reply

Your Email Id will not be published!