PM Modi : రోడ్లు జాతి నిర్మాణానికి పునాదులు – మోదీ
ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం
PM Modi : రహదారులు జాతి నిర్మాణంలో, పురోభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం రాజస్థాన్ లోని దౌసా నుండి ఢిల్లీ – ముంబై ఎక్స్ ప్రెస్ వే లోని 246 కిలో మీటర్ల ఢిల్లీ – దౌసా – లాల్సోట్ సెక్షన్ ను ప్రధాన మంతి మోదీ ప్రారంభించారు.
ఇక ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ వే 1,386 కిలోమీటర్ల పొడవుతో భారత దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ఇది అని పేర్కొన్నారు ప్రధానమంత్రి. ఈ కొత్త రహదారి వల్ల దేశ రాజధాని ఢిల్లీ నుండి జైపూర్ కు ప్రయాణ సమయం 5 గంటల నుండి 3 గంటలకు తగ్గుతుందన్నారు.
ఢిల్లీ – దౌసా – లాల్ సోట్ సెక్షన్ ప్రారంభోత్సవానికి గుర్తుగా మోదీ రిమోట్ బటన్ ను నొక్కారు. దీనిని రూ. 12,150 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో రహదారిని నిర్మించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ ప్రెస్ వేలో మొదటి పూర్తి చేసిన ఈ విభాగం మొత్తం ఆర్థిక అభివృద్దికి అతి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
ఇక దౌసా నుండి రూ . 18,100 కోట్ల కంటే ఎక్కువ విలువైన రోడ్డు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి.
ఈ కార్యక్రమంలో ఊ. 5,490 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో అభివృద్ది చేయనున్న 247 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. వృద్ది, అభివృద్ది , కనెక్టివిటీ పై కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు.
Also Read : కారు రేసులు ఎవరు అడిగిండ్రు